మారడోనా గుర్తుగా.. ఓ మ్యూజియం

ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా గుర్తుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ సోమవారం ప్రకటించాడు. అందులో ప్రత్యేక ఆకర్షణగా మారడోనా బంగారు...

Published : 08 Dec 2020 09:47 IST

కొచ్చి: ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా గుర్తుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ సోమవారం ప్రకటించాడు. అందులో ప్రత్యేక ఆకర్షణగా మారడోనా బంగారు శిల్పాన్ని ఏర్పాటు చేయనున్నారు. గత నెల 25న గుండెపోటుతో మరణించిన మారడోనాకు బాబీ మంచి స్నేహితుడు. నగల వ్యాపారి అయిన అతను ఎనిమిదేళ్ల క్రితం మారడోనాను కేరళకు తీసుకొచ్చాడు. ఈ మ్యూజియం కోల్‌కతాలో లేదా దక్షిణ భారత్‌లో నిర్మించే వీలుంది. ‘‘2011 నుంచి మారడోనాతో నాకు అనుబంధం ఉంది. తన రూపంతో ఉన్న చిన్న బంగారు విగ్రహాన్ని  అతనికి అందించా. అది తీసుకున్న అతను తన ఎత్తుతో (అయిదున్నర అడుగులు) ఉన్న బంగారు శిల్పాన్ని చూడాలని ఉందనే కోరికను వ్యక్తపరిచాడు. అది కూడా ‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ను గుర్తుకు తెచ్చేలా ఉండాలని ఆశించాడు. అతని కోరికను నిజం చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యూజియం అతనికి అంకితం. అందులో అతని వ్యక్తిగత, ఆటకు సంబంధించిన విశేషాలు పొందుపరుస్తాం’’ అని బాబీ తెలిపాడు. బాబీ చెమ్మనూర్‌ అంతర్జాతీయ సంస్థకు మారడోనా ప్రచారకర్తగా పనిచేశాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు