Badminton: గోపీచంద్‌.. బ్యాడ్మింటన్‌ హబ్‌

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌.. ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. బ్యాడ్మింటన్‌ హబ్‌ పేరుతో ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా అతను బ్యాడ్మింటన్‌ సామగ్రిని అమ్మబోతున్నాడు. వ్యాపారవేత్తలు అఫ్రోజ్‌ ఖాన్‌, రోనక్‌

Updated : 11 Nov 2021 10:02 IST

హైదరాబాద్‌, ఈనాడు: భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌.. ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. బ్యాడ్మింటన్‌ హబ్‌ పేరుతో ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా అతను బ్యాడ్మింటన్‌ సామగ్రిని అమ్మబోతున్నాడు. వ్యాపారవేత్తలు అఫ్రోజ్‌ ఖాన్‌, రోనక్‌ సచ్‌దేవాలతో కలిసి గోపీచంద్‌ ఈ వ్యాపారాన్ని ఆరంభించాడు. బుధవారం ఈ ఆన్‌లైన్‌ స్టోర్‌ ఆవిష్కరణ జరిగింది. ‘‘గత ఏడాది అన్ని వ్యాపారాలూ ఆన్‌లైన్‌ బాట పట్టినా.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు మాత్రం బయటి మార్కెట్‌ మీదే ఆధారపడ్డారు. వారికి నమ్మదగ్గ ఈ కామర్స్‌ స్టోర్‌ అవసరముందని భావించాం. దేశంలోని బ్యాడ్మింటన్‌ క్రీడాకారులందరికీ ప్రపంచ స్థాయి సామగ్రి అందించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న ప్రయత్నమిది’’ అని గోపీచంద్‌ తెలిపాడు.

సీజన్‌.. ఎట్టకేలకు!

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఆగిపోయిన బ్యాడ్మింటన్‌ సీజన్‌ ఎట్టకేలకు పునఃప్రారంభం కాబోతోంది. 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చే నెల నుంచే భారత దేశవాళీ బ్యాడ్మింటన్‌ సీజన్‌ ఆరంభం కానుంది. డిసెంబరు 16-22 తేదీల మధ్య చెన్నైలో జరిగే లెవెల్‌-3 బ్యాడ్మింటన్‌ టోర్నీతో కొత్త సీజన్‌కు తెరలేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని