Amarinder singh: వారితో కలిసి పంజాబ్‌లో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: కెప్టెన్‌

వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌)తో కలిసి తామ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.....

Published : 30 Nov 2021 01:39 IST

చండీగఢ్‌: వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌)తో కలిసి తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. హరియాణా ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో ఆకస్మికంగా సమావేశమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖట్టర్‌తో భేటీలో రాజకీయ ప్రాధాన్యమేమీలేదని, మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిశానన్నారు. ఆయనతో కలిసి మంచి కాఫీ తాగానని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌లో కొన్ని పెద్ద ముఖాలు చేరే అవకాశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. ‘‘కొంత సమయం వేచి చూడండి. అంతా సజావుగా సాగుతుంది.  ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మా సభ్యత్వ కార్యక్రమం బాగా కొనసాగుతోంది’’ అని వివరించారు.  పంజాబ్‌ ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించి దిల్లీ వెళ్లి భాజపా అధిష్ఠానం పెద్దలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. మూడు సాగు చట్టాల వ్యవహారం ముగిసిపోయిందన్న కెప్టెన్‌.. ఆ చట్టాలను పార్లమెంటే రద్దు చేసిందన్నారు. తమ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏ సమయంలోనైనా సమాచారం రావొచ్చని తెలిపారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని