Vijayasai Reddy: వరదలతో నష్టపోయాం.. కేంద్రం చేయూత అందించాలి: విజయసాయిరెడ్డి

వర్షాలతో ఏపీలో కొన్ని జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో ఏపీ వరదల

Updated : 30 Nov 2021 13:55 IST

దిల్లీ: వర్షాలతో ఏపీలో కొన్ని జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో ఏపీ వరదల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆకస్మికంగా వచ్చిన వరదలతో వేలమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. వరదల వల్ల 44 మంది చనిపోయారని.. 16 మంది గల్లంతైనట్లు వివరించారు. 1.85లక్షల హెక్టార్లలో రూ.654 కోట్ల విలువైన పంటలు వరదల పాలయ్యాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇవి కాకుండా మొత్తంపై ప్రాథమికంగా 6,054 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారన్నారు.  క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేపట్టిందన్నారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించాలని విజయసాయిరెడ్డి కోరారు. 

ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రభుత్వం విఫలం: సీఎం రమేశ్‌

అనంతరం భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ వర్షాలపై వాతావరణశాఖ ముందే సమాచారం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి వరద పెద్ద ఎత్తున వచ్చిందన్నారు. వేల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. అందుకే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని