TS News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్‌లో ముగిసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల..

Published : 29 Nov 2021 01:02 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్‌లో ముగిసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలని సూచించారు.

‘‘పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్ర వాణి బలంగా వినిపించాలి. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలి. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్‌ చట్టాల రద్దు కోసం పోరాడాలి. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలి. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలి’’ అని ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం చేశారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో పాటు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని