TS News: తెరాస మహాధర్నా ప్రారంభం

వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌

Updated : 18 Nov 2021 12:49 IST

హైదరాబాద్‌: వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) మహాధర్నా చేపట్టింది. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ధర్నా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే నిరసనకు కేసీఆర్‌ నేతృత్వం వహిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌, రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లు పాల్గొన్నారు. ధర్నా అనంతరం సీఎం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని