TS News: నాలుగు ప్రధాన ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ కార్యాచరణ: రేవంత్‌రెడ్డి

ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే కామారెడ్డిలో ధాన్యం రాశిపై గుండెపగిలి రైతు చనిపోయాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో..

Updated : 07 Nov 2021 05:38 IST

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే కామారెడ్డిలో ధాన్యం రాశిపై గుండెపగిలి రైతు చనిపోయాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో గాంధీ భవన్‌లో అత్యవసరంగా సమావేశమైన రేవంత్‌రెడ్డి .. నాలుగు ప్రధాన ప్రజాసమస్యలపై సమీక్ష చేసి భవిష్యత్‌ కార్యాచరణ తీసుకున్నట్టు వెల్లడించారు. వరి వేస్తే ఉరి తీస్తామంటూ కేసీఆర్‌ రైతులపై ప్రతాపం చూపుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీకి చెందిన నాలుగు బృందాలు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తాయని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పన్నులు వేసి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై జంగ్‌ సైరన్‌ మోగించామని, పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని దళితబంధు తెచ్చిన సీఎం కేసీఆర్‌ ఉప ఎన్నిక తర్వాత 4వ తేదీ నుంచి దళితబంధు అమలు చేస్తామని ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తలేదని ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని