Ap News: 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ.. రైతుల తొలి విజయం: కనకమేడల

రాజధాని అంశంపై న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలే కుట్రలో భాగంగానే 3 రాజధానుల బిల్లుల ఉపసంహరణ నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ కనకమేడల రవీంద్ర

Updated : 24 Nov 2021 15:10 IST

అమరావతి: రాజధాని అంశంపై న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలే కుట్రలో భాగంగానే 3 రాజధానుల బిల్లుల ఉపసంహరణ నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. 3 రాజధానుల బిల్లులో ఎన్నో చట్ట ఉల్లంఘనలు ఉన్నందునే ఏ కోర్టులోనూ ఆ బిల్లు నిలబడదని.. న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రానుందని ప్రభుత్వం ముందుగానే పసిగట్టిందన్నారు. పూర్తిస్థాయి బిల్లుతో మరోసారి ప్రజల ముందుకొస్తానని చెప్పిన సీఎం.. ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లు అసంపూర్తిగా ఉందని అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. ఏదేమైనా 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ మహాపాదయాత్రలో రైతుల తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. రైతుల మహాపాదయాత్రతో ప్రభుత్వం భయపడబట్టే మద్దతు తెలిపేవారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. క్రమశిక్షణతో సాగుతున్న పాదయాత్రకు మద్దతు తెలిపే వారిపై పోలీసుల బెదిరింపులు సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని