TS News: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నెపంతో రైతులకు అన్యాయం: ఉత్తమ్‌

వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూ.లక్షల కోట్ల బడ్జెట్‌లు ఎందుకు అని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Published : 19 Nov 2021 01:37 IST

హైదరాబాద్‌: వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూ.లక్షల కోట్ల బడ్జెట్‌లు ఎందుకు అని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దాని మీద ఒకటి నెపం వేసుకొని రైతులను అన్యాయం చేస్తున్నాయని ఉత్తమ్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు భాజపా ప్రతిపాదనలకు అనుకూలంగా చాలా సార్లు ఓట్లు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రబీ పంటలో ఆంక్షలు పెట్టొద్దని, ఖరీప్‌ పండించే వరి పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతాంగం పక్షాన కాంగ్రెస్‌ పార్టీ నిలబడుతుందని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని