Ts News: సీఎం కేసీఆర్‌ మొండి వైఖరితో రైతులకు నష్టం: కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు

Published : 30 Nov 2021 01:29 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళిక విడుదల చేశాయన్నారు. ఒకసారి పత్తి వద్దన్నారు.. మరోసారి వరి వద్దన్నారు.. వ్యవసాయంపై సీఎం కేసీఆర్‌కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌కు నిద్రపట్టని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

‘‘ధాన్యం విషయంలో లేని సమస్యను పట్టుకొని సీఎం కేసీఆర్‌ ఆందోళన చేస్తున్నారు. బాయిల్డ్‌ రైస్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా హెచ్చరిస్తూనే ఉంది. ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించాలి. మేము బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వము అని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి రాసి ఇచ్చింది. కొత్త వంగడాలు ఇచ్చి రైతులను రా రైస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించాలి. పుత్రవాత్సల్యం కోసం రైతులకు ఆగం చేయొద్దు. భాజపాపై వ్యతిరేకత పెంచేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. చివరి బస్తా వరకు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని