Ts News: భాజపాని ప్రత్యామ్నాయ పార్టీగా రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారు: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని.. సీఎం కేసీఆర్‌ కుటుంబం అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఘాటు

Published : 25 Nov 2021 01:49 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని.. సీఎం కేసీఆర్‌ కుటుంబం అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భాజపాని ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. భాజపాకు అవకాశం ఇస్తేనే పేదలకు న్యాయం, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే భావనలో ప్రజలున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రజలకు విశ్వాసం కల్పించి వారి పక్షాన పోరాడాల్సిన బాధ్యత భాజపా నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఓబీసీ జాతీయ మెర్చా అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని