Polavaram-Lokesh: రూ.850 కోట్లు ఖర్చు చేస్తే పోలవరం పూర్తవుతుందా?:లోకేశ్‌

పోలవరం నిర్మాణం వెనుక 1.9 లక్షల మంది ప్రజల త్యాగం ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు...

Updated : 31 Aug 2021 16:34 IST

కూనవరం: పోలవరం నిర్మాణం వెనుక 1.9 లక్షల మంది ప్రజల త్యాగం ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పోలవరం నిర్వాసితులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా కూనవరం మండలంలోని పోలవరం నిర్వాసితులను నారా లోకేశ్‌  పరామర్శించారు. రోజులు గడుస్తున్నా పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. 2019లో వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను వైకాపా ప్రభుత్వం ఆదుకోలేదని, ₹2,500 సాయం చేయలేని ఈ ప్రభుత్వం.. ₹10 లక్షలు ఎలా ఇవ్వగలదని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటి కూడా కట్టలేదని లోకేశ్‌ విమర్శించారు. ఈ ఏడాది జులై నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పి గత రెండున్నరేళ్లలో రూ.850 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని లోకేశ్‌ విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని