అభివృద్ధికే పట్టభద్రులు ఓటేశారు: తలసాని 

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవి విజయంపై మంత్రి తలసాని .......

Published : 20 Mar 2021 18:47 IST

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవి విజయంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎప్పటికప్పుడు తమను అప్రమత్తం చేస్తూ వచ్చారన్నారు. ప్రత్యేకించి భాజపాకు చెంపచెళ్లుమనేలా పట్టభద్రులు సమాధానం చెప్పారన్నారు. ఈ విజయం తమ పార్టీకి ఇంకా బలాన్నిచ్చిందని, మరింత ఉత్సాహంగా  పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పట్టభద్రులు ఓటేశారన్నారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రతి రౌండ్‌లోనూ తమకు మెజార్టీ వచ్చిందని చెప్పారు. ఏ నమ్మకంతో తమకు ఓటేశారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని