సిద్ధూ ఇంకా కొంత సమయం కోరారు! 

మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తమ ప్రభుత్వంలో భాగంగా ఉండాలనే ప్రతిఒక్కరం కోరుకుంటున్నారని పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు.  ఈ మాజీ క్రికెటర్‌ త్వరలోనే ......

Published : 19 Mar 2021 01:55 IST

సీఎం అమరీందర్‌ సింగ్‌ వెల్లడి

చండీగఢ్‌: మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తమ ప్రభుత్వంలో భాగంగా ఉండాలనే ప్రతిఒక్కరం కోరుకుంటున్నారని పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు.  ఈ మాజీ క్రికెటర్‌ త్వరలోనే మళ్లీ తన మంత్రివర్గంలో చేరతారని తెలిపారు. బుధవారం సాయంత్రం సిద్ధూతో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని తెలిపారు. ప్రభుత్వంలో భాగం కావడంపై నిర్ణయం తీసుకొనేందుకు ఇంకా తనకు కొంత సమయం కావాలని సిద్ధూ కోరినట్టు  సీఎం వెల్లడించారు.

గతంలో తన వద్ద ఉన్న కీలక శాఖను సీఎం తొలగించారన్న కినుకతో సిద్ధూ కేబినెట్‌ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ మంత్రివర్గంలో చేరికపై నిన్న అమరీందర్‌ సింగ్‌తో చర్చలు జరిపారు. ఇందుకోసం అమరీందర్‌ సింగ్‌ వ్యవసాయక్షేత్రంలో ఇరువురు నేతలూ సమావేశమయ్యారు. తన ప్రభుత్వానికి నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు.

పాక్‌ సరిహద్దుల నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వదలడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  మరోవైపు, పంజాబ్‌లో కరోనా కేసులు పెరగడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ సమయాన్ని పొడిగించారు. .గతంలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఉన్న రాత్రిపూట కర్ఫ్యూ వేళల్ని.. రాత్రి 9నుంచి ఉదయం 5వరకు మారుస్తున్నట్టు సీఎం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని