ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ వైఖరి తెలపాలి!

ఆర్టికల్‌ 370 రద్దుపై స్పష్టమైన వైఖరిని తెలపాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Published : 14 Jun 2021 01:34 IST

దిగ్విజయ్ సింగ్‌ వ్యాఖ్యలను ఖండించిన రవిశంకర్‌ ప్రసాద్‌

దిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దుపై స్పష్టమైన వైఖరిని తెలపాలంటూ కాంగ్రెస్‌ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని పునరాలోచిస్తామంటూ పాకిస్థాన్‌కు చెందిన ఓ విలేకరితో దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు మంత్రి ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. దిగ్విజయ్‌ సింగ్‌ సూచించినట్టుగా ఆర్టికల్‌ 370 పునరుద్థరణపై కాంగ్రెస్‌ యోచిస్తోందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తోందని ఆరోపించారు. వెంటనే మౌనం వీడాలని పార్టీని డిమాండ్‌ చేశారు. ఈ ఆర్టికల్‌ను రద్దు చేసిన అనంతరం జమ్మూ కశ్మీర్‌లో సుపరిపాలన సాగుతోందన్నారు. కరోనా కట్టడిలో భాగంగా అక్కడి మారుమూల ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగడం అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు