Punjab Polls: సీఎం చన్నీకి భగవంత్‌ మాన్‌ సవాల్‌!

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు ......

Published : 23 Jan 2022 01:56 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ సహా పలు విపక్షాలు మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ సీఎం చన్నీకి సవాల్‌ విసిరారు. తాను బరిలో ఉన్న ధూరి స్థానంలో చన్నీ పోటీ చేయగలరా? అన్నారు. చన్నీ పోటీ చేస్తున్న చామ్‌కౌర్‌ షాహిబ్‌ సీటు రిజర్వుడ్‌ స్థానం గనక తాను అక్కడి నుంచి పోటీ చేయలేననీ.. కానీ చన్నీ ధూరి సీటులో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆయన తనపై పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని భగవంత్‌ మాన్‌ చెప్పారు. మరోవైపు, శనివారం భగవంత్‌ మాన్‌ చన్నీ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, శ్రీరామతీర్థ మందిర్‌లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ..  సీఎం చన్నీ తన పేరిట ఉన్నట్టుగా రూ.56కోట్ల విలువైన అక్రమాస్తులకు సంబంధించిన పేపర్లపై ఆయన తప్పనిసరిగా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రంలోని ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో చన్నీ జోక్యం ఉన్నట్టు మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ కూడా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా భగవంత్‌ మాన్‌ ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు