ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం?: పవన్‌ 

దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడుతున్న సైనికులను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశంసించారు. ఆర్మీ డే (జనవరి 15)......

Updated : 16 Jan 2021 19:59 IST

అమరావతి: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశంసించారు. ఆర్మీ డే (జనవరి 15) భారతీయులందరికీ పుణ్యదినమన్నారు. వీర జవానుల త్యాగాలను త్రికరణశుద్ధిగా స్మరించుకొనే రోజు ఇదేనన్నారు. ఈ దేశాన్ని కాపాడే వీర పుత్రులకు తన తరఫున, జనసేన తరఫున జేజేలు పలుకుతూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘130కోట్ల మంది భారతీయుల ప్రాణాలను అనుక్షణం రక్షించే జవాన్ల రుణాన్ని మనం ఏమిచ్చి తీర్చుకోగలం. నిండైన మనసుతో వారికి జేజేలు పలకడం తప్ప. ఎండనక, వాననక, కాలాలకతీతంగా అహర్నిశలు మన దేశ సరిహద్దులను కాపాడే సైనికుల త్యాగనిరతి వెలకట్టలేనిది. మన ప్రాణాలను రక్షించడానికి తమ ప్రాణాల్ని అడ్డువేసే వారి ధీరత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా సెల్యూట్‌ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

కేంద్రం × రైతులు: తొమ్మిదో‘సారీ’ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని