Punjab politics: రాహుల్‌తో సిద్ధూ భేటీ 

పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతున్న వేళ మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో......

Published : 30 Jun 2021 20:44 IST

దిల్లీ: పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతున్న వేళ మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్‌ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. సిద్ధూ కార్యాలయం ప్రకటించినట్టు ఆయనతో సమావేశం కానున్నారా అని రాహుల్‌ను మీడియా ప్రతినిధులు నిన్న ప్రశ్నించగా.. ‘‘అలాంటి సమావేశం ఏదీలేదు. మీరు చేస్తున్న రచ్చ గురించి నాకేం తెలియదు’’ అంటూ రాహుల్ సమాధానమిచ్చిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం గమనార్హం. మరోవైపు, సిద్ధూ ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో భేటీ అయ్యారు. ‘ప్రియాంకా గాంధీతో సుదీర్ఘ సమావేశం జరిగింది’ అంటూ ఆయన ట్విటర్‌లో ఫొటో షేర్‌ చేశారు. అయితే, వారిద్దరి భేటీకి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. 

పంజాబ్ కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు కొనసాగుతుండటంతో రాహుల్ అక్కడి పార్టీ నేతలతో గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారం నిలుపుకోవాలని కాంగ్రెస్‌ అదిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, ఈసారి ఎలాగైనా పంజాబ్‌ పీఠం దక్కించుకోవాలని ఆప్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అక్కడ పర్యటించి ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని