AP News: జగన్‌ సీఎం అయ్యాక మహిళలపై దాడులు పెరిగాయి: లోకేశ్‌

సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర మహిళలకేం న్యాయం చేస్తారంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు. జగన్‌...

Updated : 17 Aug 2021 10:17 IST

మంగళగిరి: సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర మహిళలకేం న్యాయం చేస్తారంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ఆడపిల్లలను కాపాడాలని ఫిర్యాదు చేస్తే రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ తెదేపా నాయకులు,మహిళా కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయి. వైకాపా నాయకుల తీరువల్లే మహిళలపై దాడులు పెరిగాయి. జగన్‌ సీఎం అయ్యాక 500 మంది మహిళలపై దాడులు జరిగాయి’’ అని విమర్శించారు.గుంటూరులోని కాకాని రోడ్డులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తొలుత ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయన్ను విడుదల చేయాలంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో సాయంత్రం 5.30 ప్రాంతంలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చి, ఆయన కాన్వాయ్‌లోనే గోప్యంగా తరలించారు. పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్డుల్లో కొద్దిసేపు తిప్పిన తర్వాత పెదనందిపాడు, పొన్నూరు,గుంటూరు మీదుగా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నోటీసులపై సంతకం తీసుకొని స్టేషన్‌ నుంచి విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని