Raghurama అంశంపై నివేదిక కోరిన స్పీకర్‌! 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును........

Published : 22 May 2021 01:30 IST

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని హోంశాఖను స్పీకర్‌ కార్యాలయం కోరింది. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపింది. ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు గురువారం లోక్‌సభ సభాపతి ఓం బిర్లాను కలిసిన విషయం తెలిసిందే. ఎంపీ సతీమణి రమ, కుమారుడు భరత్‌, కుమార్తె ఇందు ప్రియదర్శిని ఆయనను కలిసి రఘురామ అరెస్టు, కస్టడీలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేశారు. అంతకు ముందురోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిసి, అరెస్టు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని