కేంద్ర ఆర్థిక మంత్రితో బుగ్గన భేటీ 

హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యింది. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్‌ అంశాలతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం 

Updated : 10 Jul 2020 14:13 IST

దిల్లీ: హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యింది. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్‌ అంశాలతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా రాష్ట్ర అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశం చిక్కలేదన్నారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు.‘‘ పన్ను వసూళ్లలో గత 3 నెలల్లో 40శాతం లోటు ఏర్పడింది. జీఎస్టీ బకాయిలు రూ. 3,000 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలతో పాటు.. అదనంగా నిధులిచ్చి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాము’’ అని బుగ్గన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని