తెదేపా కేంద్ర కార్యాలయం మూసివేత

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయాన్ని మూసివేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ప్రధాని మోదీ సూచనల మేరకు ఎన్టీఆర్‌ భవన్‌కు సందర్శకులు...

Published : 21 Mar 2020 00:54 IST

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయాన్ని మూసివేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ప్రధాని మోదీ సూచనల మేరకు ఎన్టీఆర్‌ భవన్‌కు సందర్శకులు, కార్యకర్తలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తలు కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఏదైనా సమాచారం ఉంటే వాట్సాప్‌, ఫోన్ల ద్వారా అందించాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది కూడా ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం తెదేపా ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుందని చంద్రబాబు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని