Updated : 28/01/2020 13:00 IST

తెదేపా పార్లమెంటరీ నేతలతో చంద్రబాబు భేటీ

మంగళగిరి: తెదేపా పార్లమెంటరీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం అంశంతోపాటు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ హాజరయ్యారు. మరోవైపు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబు మధ్యాహ్నం భేటీ కానున్నారు. రాజధాని రైతుల ఆందోళనలు, అమరావతి ఐకాస కార్యక్రమాలపై చర్చించనున్నారు. మండలి రద్దుపై ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చిస్తారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని