టీడీఎల్పీ సమావేశానికి 5 ఎమ్మెల్సీల గైర్హాజరు

ఏపీ శాసనమండలి రద్దు ప్రచారం నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలో చంద్రబాబు భేటీ అయ్యారు.

Published : 26 Jan 2020 14:22 IST

మంగళగిరి: ఏపీ శాసనమండలి రద్దు ప్రచారం నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలో చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మండలిలో తెదేపా తరఫున 32 మంది ఎమ్మెల్సీలుండగా సమావేశానికి 23 మంది హాజరయ్యారు.

మరోవైపు టీడీఎల్పీ భేటీకి రాలేమని ఐదుగురు ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్‌, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ ముందుగానే సమాచారమిచ్చారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్ధంతి దృష్ట్యా సమావేశానికి రాలేనని గాలి సరస్వతి, తన మేనత్త కర్మ కార్యక్రమం ఉండటం వల్ల సమావేశానికి హాజరవ్వలేనని కేఈ ప్రభాకర్‌ తెలిపారు. ఆరోగ్యం బాగాలేనందున సమావేశానికి రాలేనని శత్రుచర్ల తెలుపగా..తన నివాసంలో పెళ్లి ఉండటంతో రాలేకపోతున్నానని తిప్పేస్వామి పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నందున రాలేకపోతున్నానని రామకృష్ణ అన్నారు.

తమ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తోందని తెదేపా ఆరోపించింది. ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. మండలిలో తెదేపాకు 32 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. అయితే ఇప్పటికే పోతుల సునీత, శివనాథరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మండలిని సమావేశపరిస్తే సభ్యులు చేజారకుండా వ్యూహ రచన చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని