సీఆర్డీఏపై సీఎం కీలక సమావేశం

మూడు రాజధానుల అంశంతో పాటు సీఆర్డీఏ బిల్లుపై న్యాయ, సాంకేతికపరమైన అడ్డంకులు రాకుండా ఎలా వ్యవహరించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి .. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే హైపవర్‌ కమిటీ సీఎంతో సమావేశమై చర్చించింది. సీఆర్డీఏ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated : 18 Jan 2020 16:07 IST

అమరావతి: మూడు రాజధానుల అంశంతో పాటు సీఆర్డీఏ బిల్లుపై న్యాయ, సాంకేతికపరమైన అడ్డంకులు రాకుండా ఎలా వ్యవహరించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి .. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే హైపవర్‌ కమిటీ సీఎంతో సమావేశమై చర్చించింది. సీఆర్డీఏ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 

రాజధానులపై అసెంబ్లీలో సోమవారం బిల్లు ప్రవేశపెట్టాలంటే ముందుగా గవర్నర్‌ అనుమతి తీసుకోవాలి. అదే రోజు ఉదయం 9 గంటలకు మంత్రిమండలి ఆమోదిస్తే గవర్నర్‌కు పంపి ఆయన అనుమతి తీసుకుని మళ్లీ 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు తీసుకురావడంలో హడావుడి ఏర్పడుతుంది. అందువల్ల సోమవారం కాకుండా మంత్రిమండలి భేటీని శనివారమే నిర్వహించాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి. అయితే బిల్లుపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్చించాల్సి ఉందని, అందుకే  మంత్రిమండలిలో ప్రవేశపెట్టడానికి వీలు కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత సమయం తీసుకుని మంత్రిమండలి ముందుంచాలని భావించాయి.ఇందుకోసమే కేబినెట్‌ ముందస్తుగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే రెండుసార్లు ఏపీ కేబినెట్‌ సమావేశం షెడ్యూల్‌ మారింది. ఈనెల 20న  కేబినెట్‌ సమావేశం కానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని