Ap news : కొత్త జిల్లాలపై రాత్రికి రాత్రే నోటిఫికేషన్లు ఎందుకు?: చంద్రబాబు

నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజల ఆకాంక్షల మేరకు వ్యవహరించాలని..

Published : 27 Jan 2022 18:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజల ఆకాంక్షల మేరకు వ్యవహరించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేదికగా వ్యూహ కమిటీ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చ జరిగింది. కొత్త జిల్లాలపై చాలా చోట్ల వైకాపా నుంచే వ్యతిరేకత వస్తోందని చంద్రబాబు తెలిపారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజనతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి వచ్చిందన్నారు. మంత్రివర్గంలో సమగ్రంగా చర్చించకుండా.. రాత్రికి రాత్రే నోటిఫికేషన్‌ ఎందుకు? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యను పక్కదారి పట్టించేందుకే తెరపైకి నూతన జిల్లాల ప్రక్రియను ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఎన్టీఆర్‌ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామన్న తెలుగుదేశం వ్యూహ కమిటీ వెల్లడించింది. ఎన్టీఆర్‌ స్మృతివనం ప్రాజెక్టను జగన్‌ ప్రభుత్వం నిలిపివేసిందని నేతలు ఆరోపించారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉందని చెప్పే వైకాపా ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరని నేతలు వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు