Punjab: ఇప్పటికైనా పంజాబ్‌ సర్కార్‌ వాస్తవాలు తెలుసుకోవాలి: అమరీందర్‌

టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌ ఘటనతో పంజాబ్ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించలేని స్థితిలో నుంచి బయటకు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల కిందట ఫెరోజ్‌పూర్‌ జిల్లాలోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన అలికే గ్రామంలో పేలుడు పదార్థాలతో నిండిన

Published : 06 Nov 2021 01:55 IST

అమృత్‌సర్‌: టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌ ఘటనతో పంజాబ్ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించలేని స్థితిలో నుంచి బయటకు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల కిందట ఫెరోజ్‌పూర్‌ జిల్లాలోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన అలికే గ్రామంలో పేలుడు పదార్థాలతో నిండిన టిఫిన్‌ బాక్స్‌ కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై దాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురు అనుమానుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తాజాగా అమరీందర్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఇకనైనా పంజాబ్‌ ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి(సుఖ్‌జిందర్‌ సింగ్‌ రాంద్వా) వాస్తవాలను అంగీకరించలేని పరిస్థితి నుంచి బయటకు వస్తారని, ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తారని ఆశిస్తున్నా’’అని అమరీందర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. తరచూ భారత్‌, పాక్‌ సరిహద్దు నుంచి వస్తువుల రవాణా జరుగుతుందని.. వీటిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 

గతంలోనూ అమరీందర్‌ సింగ్‌ పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందని పలుమార్లు హెచ్చరించారు. దీనిపై పంజాబ్‌ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ కూడా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో లేనిపోని భయాల్ని సృష్టిస్తాయన్నారు. గత కొన్ని నెలల వ్యవధిలో అమృత్‌సర్‌ గ్రామీణ ప్రాంతాల్లో, కపుర్తాలా, ఫజిల్కా, తర్న్‌ తారన్‌ ప్రాంతాల్లో టిఫిన్‌ బాంబులను పోలీసులు గుర్తించారని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని