మెచ్యూరిటీ త‌ర్వాత యులిప్ కొన‌సాగించ‌డం లాభ‌మేనా?

పాక్షిక సెటిల్‌మెంట్ ఆప్ష‌న్‌ ఎంచుకున్నప్పటికీ, ఏ సమయంలోనైనా మెచ్యూరిటీ మొత్తాన్ని పొందేందుకు వీలుంటుంది

Published : 27 Dec 2020 17:07 IST

యులిప్స్ పెట్టుబ‌డుదారుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే విధంగా ఐఆర్‌డీఏఐ పెట్టుబ‌డుదారులకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసింది. ప్ర‌స్తుతం మార్కెట్లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నందున్న యులిప్ పెట్టుబ‌డుదారులు న‌ష్ట‌పోకుండా, మే 31 లోపు మెచ్యూరిటీ ముగుస్తున్న యులిప్ పాల‌సీల‌ను మ‌రో ఐదేళ్ల‌పాటు కొనసాగించే అవ‌కాశం ఇవ్వాల్సిందిగా బీమా సంస్థ‌ల‌ను కోరింది.

సాధారణంగా, యులిప్ మెచ్యూరిటీపై మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. అయితే 2013 నిబంధన ప్ర‌కారం ఐదేళ్ల వ్యవధిలో మెచ్యూరిటీ విలువను వాయిదాలలో చెల్లించవ‌చ్చు. కానీ ఈ నిర్ణ‌యం సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కోవిడ్ -19 దుష్ప్రభావంగా మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో, ఇప్పుడు మే 31 వరకు మెచ్యూరిటీ పూర్త‌యిన యులిప్‌‌ పాలసీల కోసం పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ లేదా అస్థిరంగా ఐదేళ్ల‌వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంది. మ‌రి దీనిని ఎంచుకోవ‌డం స‌రైన నిర్ణ‌య‌మేనా తెలుసుకోండి

పాలసీదారులకు అటువంటి ఎంపిక అందుబాటులో ఉందని తెలియజేయడానికి బీమా సంస్థలు ఇ-మెయిల్స్ , ఎస్ఎంఎస్‌ల‌ను పంపిస్తున్నాయి. మీరు పాక్షిక ఉపసంహ‌ర‌ణ కావాల‌నుకుంటే, మీకు పంపిన లింక్ ద్వారా లేదా న‌మోదిత‌ ఇ-మెయిల్ ఐడి నుంచి సంస్థకు ఇ-మెయిల్ పంపడం ద్వారా ఈ స‌దుపాయం పొంద‌వ‌చ్చు. మ‌రోవైపు ఐదేళ్ల కాలానికి పెట్టుబ‌డుల‌ను అదేవిధంగా కొన‌సాగించే ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. అయితే నిబంధనల ప్రకారం, ప్రతి సంవత్సరం కనీసం 20% చెల్లించాలి.

యులిప్స్ మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయని పాలసీదారులకు ముందుగానే తెలిసి ఉంటుంద‌ని బజాజ్ అలియాంజ్‌ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ హెడ్ అనిల్ పిఎం అన్నారు. మెచ్యూరిటీ పూర్త‌యిన త‌ర్వాత, ప్ర‌స్తుత ఫండ్ విలువ ప్ర‌కారం తిరిగి పొందుతారు. అయితే గ‌త మూడు వారాల్లో సుమారు 35% తగ్గాయి, దీంతో రాబ‌డిలో గణనీయంగా కోల్పోయారు. చారిత్రాత్మకంగా చూస్తే, అటువంటి భారీ న‌ష్టాల త‌ర్వాత తిరిగి పుంజుకోవ‌డం ఉంటుంది. పాల‌సీదారులు ఈ లాభాన్ని పొందాల‌నుకుంటే పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ ఆప్ష‌న్ ఎంచుకోవ‌డం మంచిద‌ని అన్నారు.

మీరు ఇప్పుడు పాక్షిక సెటిల్‌మెంట్ ఆప్ష‌న్‌ ఎంచుకున్నప్పటికీ, ఏ సమయంలోనైనా మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపసంహరించుకోవలసిన అవసరం వ‌స్తే పూర్తిగా పొందేందుకు వీలుంటుంది. ఉదాహరణకు, మీరు ఈ సంవత్సరం మెచ్యూరిటీ చెల్లింపులో 20%, వచ్చే ఏడాది మరో 20% ఉపసంహరించుకుంటే, మిగిలిన 60% మూడవ సంవత్సరంలో కూడా ఉపసంహరించుకోవ‌చ్చు.

యులిప్ పెట్టుబ‌డులు అధిక ఖ‌ర్చును క‌లిగి ఉంటాయి. దీంతో పాటు రాబ‌డి కూడా త‌క్కు‌వే. అందుకే మెచ్యూరిటీ పూర్త‌యిన వెంట‌నే తీసుకోవ‌డం మేలు. లిక్విడిటీ లేనివారు ఈపీఎఫ్ఓ ఉప‌సంహ‌ర‌ణ‌కు మొగ్గుచూపుతున్నారు. ఈపీఎఫ్‌లో చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌భావం కూడా ఉంటుంది. కాబ‌ట్టి దీర్ఘ‌కాలికంగా ప్ర‌యోజ‌నం ఉంటుంది. దీనికి బ‌దులుగా యులిప్ పెట్టుబ‌డుదారులు మెచ్యూరిటీ త‌ర్వాత వెన‌క్కి తీసుకోవ‌డ‌మే మంచిద‌ని ఫిన్‌సేఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫౌండ‌ర్ డైరెక్ట‌ర్ మిరిన్ అగ‌ర్వాల్ చెప్పారు. లిక్విడిటీ స‌మ‌స్య లేక‌పోతే రాబోయే ఐదేళ్ల‌లో ఎప్పుడైనా వెన‌క్కి తీసుకునే సదుపాయం ఉంది కాబ‌ట్టి యులిప్ పెట్టుబ‌డుల‌ను ఐదేళ్ల‌వ‌ర‌కు కొనసాగించే ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని