రఫేల్‌ రాక.. రాహుల్‌ గాంధీ ప్రశ్నలు

రఫేల్‌ యుద్ధవిమానాలు బుధవారం భారత్‌కు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Updated : 30 Jul 2020 10:43 IST

యుద్ధ విమానాల రాకపై కాంగ్రెస్‌ నేత స్పందన

ఇంటర్నెట్ డెస్క్‌: తొలివిడత రఫేల్‌ యుద్ధవిమానాలు బుధవారం భారత్‌కు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ విషయమై భారతీయ వైమానిక దళానికి అభినందనలు తెలుపుతూనే.. తన సందేహాలను బయటపెట్టారు. మొదటి నుంచి రూ.59,000కోట్ల రఫేల్‌ ఒప్పందాన్ని విమర్శస్తూ వస్తున్న ఆయన.. తాజాగా మూడు ప్రశ్నలను ప్రభుత్వం ముందుంచారు.

1. ఒక్కో రఫెల్‌ విమానం ఖరీదు రూ.526 కోట్లు కాకుండా రూ.1670 కోట్లుగా ఎందుకు మారింది?
2. 126 విమానాలకు బదులుగా కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారు?
3.రూ.30,000 కోట్ల కాంట్రాక్టును హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు కాకుండా, దివాలా తీసిన అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చారు?

గతంలో కూడా రఫేల్‌ ఒప్పందం నేపథ్యంలో ‘‘చౌకీదార్‌ చోర్‌ హై..’’ (కాపలాదారే దొంగ) అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్‌ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. రక్షణ వ్యవహారాల్లో అనుభవం లేని అనిల్‌ అంబానీ సంస్థకు అతి కీలకమైన కాంట్రాక్టును అప్పగించారంటూ కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ వారికి లాభం కలిగించేందుకు ఒప్పందంలో ధరలను పెంచేశారంటూ అనేకమార్లు ఈ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం క్లీన్‌ చిట్‌ ఇవ్వడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని