పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులపై విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా విపక్షాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో ర్యాలీ నిర్వహించి

Published : 23 Sep 2020 13:27 IST

దిల్లీ: రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులపై విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా విపక్షాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడానికి వీల్లేని విధంగా ప్రైవేటు సంస్థలకు కళ్లెం వేసేలా బిల్లును తీసుకురావాలని, స్వామినాథన్‌ కమిషన్‌ చెప్పిన ప్రకారం కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తేయాలని కోరారు. 

మరో వైపు రాజ్యసభ నుంచి సస్పెండైన 8మంది ఎంపీలు పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. విపక్షపార్టీలకు చెందిన పలువురు ఎంపీలు వారికి మద్దతిచ్చారు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, శివసేన,ఆర్జేడీ, డీఎంకే, తెరాస, ఆప్‌ ఎంపీలంతా నిరసనలో పాల్గొన్నారు. సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రతిపక్షాలు భేటీ అయ్యే అవకాశముంది. వ్యవసాయ బిల్లులు, వాటి ఆమోద సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నాయి. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో కేవలం ఐదుగురు నాయకులను మాత్రమే రాష్ట్రపతి భవన్‌ అధికారులు అనుమతించినట్లు సమాచారం. రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ అజాద్‌ చాంబర్‌లో సమావేశమైన విపక్షనేతలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని