ఖైరతాబాద్‌ తెరాస అభ్యర్థికి చేదు అనుభవం

ఖైరతాబాద్‌ డివిజన్‌లో అధికార తెరాస అభ్యర్థి విజయారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం డివిజన్‌ పరిధిలోని న్యూ సీఐబీ

Published : 26 Nov 2020 01:23 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ డివిజన్‌లో అధికార తెరాస అభ్యర్థి విజయారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం డివిజన్‌ పరిధిలోని న్యూ సీఐబీ క్వార్టర్స్‌లో పార్టీ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వరద సాయం అందలేదని విజయారెడ్డిని నిలదీశారు. తన పక్కింట్లో ఉన్న వారికి రూ.10వేలు ఇప్పించి, అసలైన వరద బాధితులకు ఎందుకు ఇవ్వలేదని ఓ మహిళ ప్రశ్నించారు. 

గత ఎన్నికల్లో విజయారెడ్డి తండ్రి పీజేఆర్‌ ముఖం చూసి ఓటు వేశామని.. ఇప్పుడు ఓటు వేసే ప్రసక్తే లేదని మహిళలు తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని