ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి: ఉమ

సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం కోసం గవర్నర్‌ను ఆశ్రయించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమ

Published : 20 Jul 2020 13:10 IST

మంగళగిరి: సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం కోసం గవర్నర్‌ను ఆశ్రయించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ బిల్లులు శాసనమండలిలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రస్తుతం సెలెక్ట్‌ కమిటీ పరిశీలనలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని హంగులతో రాజధాని అమరావతి సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని