పోలవరం పూర్తయ్యేదెప్పుడు?: దేవినేని

పోలవరం ప్రాజెక్టు విషయంలో సాక్షాత్తు మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు.

Published : 17 Nov 2020 01:52 IST

మంగళగిరి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సాక్షాత్తు మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల తరఫున తెదేపా ప్రశ్నిస్తోందన్నారు. పోలవరం ఎత్తు విషయంలో అనేక అనుమానాలున్నాయని, వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు దీనిపై ఆందోళనగా ఉన్నాయని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ప్రారంభించారని చెబుతున్నారని, కానీ కేవలం అప్పుడు మట్టిపనులు మాత్రమే పూర్తయ్యాయని దేవినేని ఉమ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ వైఖరితో పోలవరంపై రూ.2,537 కోట్ల అదనపు భారం పడిందని ఆరోపించారు. 150 అడుగులు కట్టాల్సిన డ్యామ్‌ని 135 అడుగులు కట్టాలని రాజీపడ్డారని విమర్శించారు.  స్వప్రయోజనాల కోసమే స్పిల్‌వే, రాక్‌ఫిల్‌ డ్యామ్‌, పవర్‌ ప్రాజెక్టు పనులు రద్దు చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తెలుగువాడి గుండెచప్పుడుగా దేవినేని అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని