అమిత్‌ షాతో తోమర్‌ రెండున్నర గంటల భేటీ!

వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొనే వరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతు సంఘాలు తేల్చి చెప్పిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా

Updated : 10 Dec 2020 00:17 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొనే వరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతు సంఘాలు తేల్చి చెప్పిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. మంగళవారం రాత్రి రైతు సంఘాలతో చర్చించిన అమిత్‌ షా చట్టాలను వెనక్కి తీసుకొనేది లేదని, కొన్ని సవరణలకు అంగీకరిస్తామని స్పష్టంచేశారు.

అలాగే, గత 14 రోజులుగా పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతు సంఘాలకు బుధవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను పంపింది. వాటిని తిరస్కరించిన రైతు సంఘాల నేతలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు. మరోవైపు, విపక్ష నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన నేతలు.. వాటిని ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని