Updated : 09/10/2021 21:55 IST

MAA Elections: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్‌.. నాపై ఎందుకంత అక్కసు అంకుల్‌!

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవమని, మిమ్మల్ని విమర్శిస్తే, ఆయనను విమర్శించినట్లు అవుతుందని అన్నారు. అందుకే తాను నాగబాబుపై విమర్శలు చేయనని చెప్పారు.

‘‘నేను ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి ప్రత్యర్థి ప్యానెల్‌ సభ్యులు నాపైనా, నా కుటుంబం పైనా విమర్శలు చేస్తున్నారు. ఆ ప్యానెల్‌లో ఉన్న సీనియర్‌ నటి కూడా నాన్నగారిపై విమర్శలు గుప్పించారు. ఏదో ఒక దశలో ఇదంతా ఆపుతారని అనుకున్నా. నేను చేసే ప్రతి పనీ తప్పు అంటూ చిల్లరగా మాట్లాడుతున్నారు. ఎన్నికల తర్వాత మన మనమంతా ఒకే కుటుంబం అన్న సంగతి మర్చిపోతున్నారు. వాళ్ల మాటలతో నాకు బాధేసింది. వాళ్లు ఓడిపోతున్నారనే అక్కసుతో విమర్శలు చేస్తున్నారని పలువురు సలహా ఇచ్చారు. అక్కడ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి స్వార్థంతో పోటీ చేస్తున్నారు. అతన్ని నిలబెట్టిన వ్యక్తుల్లో ఒకరు బహిరంగంగా బయటకు వచ్చి, వాళ్ల తరపున నన్ను విపరీతంగా విమర్శిస్తున్నారు. వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. అవును.. ఇదంతా నాగబాబుగారి గురించే’’

‘‘అంకుల్‌.. నేను ఏం చేశానని మీకంత కోపం. నేనేంటో మీకు తెలియదా? మీ ముందు నేను పెరిగా. మా సంస్థలో మీరు నటించారు. మా కుటుంబం అంతా మీకు గౌరవం ఇస్తాం. నాకు ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆయనను తిడుతూ సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో మీరు పోస్టులు చేశారు. ఈ రోజు ఆయన మీకు మేధావి అయిపోయి, నన్ను చిన్న చూపు చూస్తున్నారు. మీకన్నా నాకు చిరంజీవిగారు అంటే అభిమానం, ప్రేమ, గౌరవం. మిమ్మల్ని విమర్శిస్తే ఆయనను విమర్శించినట్టే. తెలుగులో నాకు మార్కులు తక్కువ రావచ్చు. కానీ, క్యారెక్టర్‌ విషయంలో మార్కులు వేయాల్సి వస్తే, ఎవరికి ఎక్కువ వస్తాయో ఇండస్ట్రీ వాళ్లను అడగండి. మీరు అలా మాట్లాడటం నాకు కష్టంగా ఉంది. నేను ఇలా అడగటం మీకు నచ్చదని నాకు తెలుసు. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితే, నాది, నా కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు మీ ఫ్యాన్స్‌కు ఇచ్చి తిట్టమని చెబుతారు. కావాలంటే మీరు మా నెంబర్లు ఇవ్వవచ్చు’’

‘‘రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవిత పిల్లలతో కారులో వెళ్తుంటే మీ ఫ్యాన్స్‌ను పంపి, దాడి చేయించలేదా? వాళ్లే షూట్‌ చేసి, టీవీ వాళ్లకు ఇచ్చారు. మిమ్మల్ని అడిగితే ‘వాళ్లెవరో నాకు తెలియదు. అన్‌ రిజిస్టర్డ్‌ ఫ్యాన్స్‌’ అన్నారు. ఇది మీరు నాకూ చేయొచ్చు. పెద్ద మనిషిగా ఉంటే నన్ను అన్నేసి మాటలనడం సరికాదు. దయ చేసి నాతోనే ఆపేయండి. నా కుటుంబాన్ని ఏమీ అనొద్దు. నేను పర్‌ఫెక్ట్‌ కాదు.. నా ఫ్యామిలీ పర్‌ఫెక్ట్‌ అయి ఉండకపోవచ్చు. మీరు పర్‌ఫెక్ట్‌ కాదు.. ఏ కుటుంబం పర్‌ఫెక్ట్‌ కాదు. ప్లీజ్‌ అంకుల్‌.. దయచేసి అలా అనొద్దు. నేను పుట్టిన తర్వాత నాన్నగారు ఇంత సహనంతో ఉండటం ఇప్పటివరకూ చూడలేదు. ఆయన్ను బయటకు లాగాలని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడితే, బంధాలన్నీ తెగిపోతాయి. ఆదివారం ఎన్నికలు.. మీరు నన్ను దీవించండి’’ అని విష్ణు అన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని