Manchu Vishnu: ‘మా’ సభ్యులకు మంచు విష్ణు ప్రత్యేక సదుపాయాలు

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’(MAA) ప్రధాన ఏజెండాల్లో ఒక్కటైన సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు

Published : 24 Nov 2021 01:29 IST

హైదరాబాద్‌: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’(MAA) ప్రధాన ఎజెండాల్లో ఒక్కటైన సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. అసోసియేషన్‌లోని సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్ తోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే నిరంతరంగా సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా వైద్యనిపుణులతో ముఖాముఖీ మాట్లాడటంతో పాటు వీడియో కన్సల్టెంట్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు. అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. అలాగే టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లోనూ మా సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నట్లు విష్ణు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని