Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
Tollywood: ఇటు వెండితెరపై, అటు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలివే!
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా థియేటర్లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరగడం శుభపరిణామం. ముఖ్యంగా దసరా నవరాత్రి ఉత్సవాలు, సెలవుల నేపథ్యంలో కొత్త సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి కాస్త మంచి గుర్తింపు ఉన్న కథానాయకులు వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విడుదలై థియేటర్లో అలరించిన పలు చిత్రాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు సైతం ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించే ఆ చిత్రాలేంటో చూసేద్దామా!
గతవారం అన్న.. ఈ వారం తమ్ముడు..
గతవారం ‘రిపబ్లిక్’తో ప్రేక్షకులను పలకరించారు సాయితేజ్. ఈ వారం ఆ సినీ సందడిని ఆయన సోదరుడు వైష్ణవ్‌తేజ్ కొనసాగించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్, రకుల్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్లలో విడుదల కానుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. గొర్రెల కాపరిగా, ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మగా రకుల్ అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం బాగుంది. ఈ ఏడాది ‘ఉప్పెన’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్‌తేజ్ ‘కొండపొలం’లో ఎలా అలరిస్తారో చూడాలి!
ఎట్టకేలకు వస్తున్న ‘ఆరడుగుల బుల్లెట్’
గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల ఇంతకాలం విడుదలకు నోచుకోలేదు. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మించారు.
‘నేను లేని... నా ప్రేమకథ’ అంటున్న నవీన్ చంద్ర
నవీన్‌చంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. గాయత్రి ఆర్.సురేష్, అదితి మ్యాకల్ కథానాయికలు. సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్ కందుకూరి, నిమ్మకాయల దుర్గాప్రసాద్‌రెడ్డి, అన్నదాత భాస్కర్‌రావు నిర్మాతలు. ‘‘మనసుల్ని హత్తుకునే ప్రేమకథ ఇది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కరోనా విరామం సమయంలో ఈ చిత్రానికి దర్శకుడు ప్రత్యేకంగా మెరుగులు దిద్దారు. రాంబాబు గోసాల పాటలు, ఎన్.కె.భూపతి కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం.’’ అని చిత్ర బృందం ఇటీవల తెలిపింది. అక్టోబరు 8న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తుపాకీ పట్టిన వైద్యుడు ‘వరుణ్ డాక్టర్’
తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్. ఆయన నటించిన పలు సినిమాలు అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నీల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన తాజా మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘వరుణ్ డాక్టర్’. ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అక్టోబరు 9న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు ఓ డాక్టర్ ఏం చేశాడు? ఎవరెవరి సాయం తీసుకున్నాడు? చివరకు అమ్మాయిలను కిడ్నాప్ చేసే ముఠా ఆటకట్టించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!
మనసు దోచనున్న ‘రాజరాజ చోర’
కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన చిత్రం ‘రాజ రాజ చోర’. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్కానుంది. శ్రీ విష్ణు కథానాయకుడిగా హసిత్ గోలి తెరకెక్కించిన సినిమా ఇది. మేఘా ఆకాశ్, సునయన కథానాయికలు.
అంధాదున్.. ఇప్పుడు మలయాళంలో..
బాలీవుడ్లో ఘన విజయాన్ని అందుకుని, ఇప్పుడు చిత్ర పరిశ్రమల్లోనూ సందడి చేసిన, చేయడానికి వస్తున్న చిత్రం ‘అంధాదున్’. ఇప్పటికే తెలుగులో నితిన్ కీలక పాత్రలో ‘మ్యాస్ట్రో’గా విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఈ వారం మలయాళ ప్రేక్షకులను ‘భ్రమమ్’ పేరుతో అలరించడానికి సిద్ధమైంది. వైవిధ్య కథా చిత్రాలను ఎంచుకునే పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. రవి.కె చంద్రన్ దర్శకత్వం వహించారు. హిందీలో టబు పోషించిన పాత్రను మలయాళంలో మమతా మోహన్‌దాస్ చేస్తున్నారు. పృథ్వీ గర్ల్‌ఫ్రెండ్‌గా రాశీఖన్నా కనిపించనుంది. అక్టోబరు 7న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మరి మాతృకతో పోలిస్తే ఏమైనా మార్పులు చేశారా? లేదా? తెలియాలంటే ‘భ్రమమ్’ చూడాల్సిందే!
ఆహాలో ‘కోల్డ్ కేస్’
పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకుడు. జూన్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మలయాళం భాషలో విడుదలైంది. కాగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా అక్టోబరు 8వ తేదీ నుంచి ‘కోల్డ్ కేస్’ స్ట్రీమింగ్ కానుంది. పృథ్వీరాజ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
అమెజాన్ ప్రైమ్
📺 మాడ్రెస్- అక్టోబరు 08
📺 జస్టిన్ బీబర్ ఔర్ వరల్డ్- అక్టోబరు 08
నెట్‌ఫ్లిక్స్
📺 ఎస్కేప్ ది అండర్ టేకర్- అక్టోబరు 5
📺 డేర్స్ సమవన్ ఇన్సైడ్ యువర్ హౌస్- అక్టోబర్ 6
📺 హౌస్ ఆఫ్ సీక్రెట్స్- అక్టోబరు8
డిస్నీ+హాట్ స్టార్
📺 ముప్పెట్స్ హంటెడ్ మాన్షన్- అక్టోబరు 8
సోనీ లివ్
📺 అప్పథావా ఆట్టయా పొట్టుటాంగా- అక్టోబరు 8
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది.