Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
Tollywood movie: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే
upcoming movies: రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు సినిమా షెడ్యూల్స్‌ను తారుమారు చేశాయి. సంక్రాంతికి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు, ఓటీటీలోనూ అలరించే చిత్రాలు రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి.
‘వర్మ.. వీడు తేడా’
నట్టి క్రాంతి, ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. వీడు తేడా.. అనేది ఉపశీర్షిక. నట్టి కుమార్ తెరకెక్కిస్తున్నారు. నట్టి కరుణ నిర్మాత. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 21న విడుదల కానుంది. ‘ఎంతో హాయిగా సాగిపోతున్న ఓ సాఫ్ట్వేర్ కుర్రాడి జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంతో అతని జీవితం ఎలా మారిపోయింది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న ఆసక్తికర మలుపులతో సినిమా సాగుతుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. మరి వర్మ కథేంటో చూడాలి.
‘ఉనికి’ చాటిందా?
ఆశిష్‌గాంధీ కథానాయకుడిగా ఎవర్గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఉనికి’. చిత్రశుక్లా కథానాయిక. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మాతలు. ‘ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ యువతి కష్టపడి చదివి కలెక్టర్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలనుకున్న ఆమెకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి తన ‘ఉనికి’ని చాటుకుందనేది తెరపైనే చూడాలి. జనవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వినూత్న కథతో ‘వధుకట్నం’
శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, అనన్యా పాణిగ్రహి, జాన్ కుషాల్, రఘు.జి, కవిత శ్రీరంగం, ఆర్యన్ గౌర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వధుకట్నం’. భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్‌బాబు సాహేబ్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 21న థియేటర్లలో విడుదల కానుంది. ‘‘ప్రస్తుత సమాజంలో మహిళలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కానీ, ఇంకా వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భంలో ఉండగానే ఆడ శిశువుల్ని చంపేస్తున్నారు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. ఇదిలాగే కొనసాగితే.. పెళ్లి కోసం మగపిల్లలే ఆడపిల్లలకు ‘వధుకట్నం’ ఇవ్వాల్సి వస్తుందన్న సందేశంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!
ఇక ఓటీటీలో మాస్ జాతర
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. డిసెంబరులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ 50రోజులకు చేరువైంది. కాగా, జనవరి 21న డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ‘అఖండ’ స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ నటన, బోయపాటి టేకింగ్, తమన్ నేపథ్య సంగీతానికి థియేటర్లు దద్దరిల్లిపోగా, 21వ తేదీ నుంచి హోంథియేటర్లు వంతు రానుంది.
శ్యామ్ సింగరాయ్ కూడా ఓటీటీలో..
‘అఖండ’ తర్వాత ఈ వారం ఓటీటీలో అలరించేందుకు వస్తున్న మరో పెద్ద చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా దేవదాసీ వ్యవస్థపై పోరాటం చేసే వ్యక్తి శ్యామ్ సింగరాయ్‌గా నాని, దేవదాసిగా సాయిపల్లవి నటన హైలైట్‌గా నిలిచింది. జనవరి 21న నెట్ఫ్లిక్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
లూజర్2
ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’. సూపర్ హిట్ సిరీస్ ‘లూజర్’కు సీక్వెల్‌గా వస్తోంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తొలి సీజన్ తెరకెక్కింది. ఇప్పుడు ‘లూజర్ 2’కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. ఇక ఈ నెల 21న ‘జీ 5’లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు