Raviteja: రవితేజ సినిమాలో నటించడానికి స్టార్ హీరోలు ‘నో’చెప్పారట!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ జోరు మీదున్నారు. ‘ఖిలాడి’, ‘టైగర్ నాగేశ్వర్రావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘రావణసుర’ ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే, ‘రావణసుర’ తెరకెక్కిస్తున్న దర్శకుడు సుధీర్ వర్మతో రవితేజ కాంబినేషన్ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగుంది. వీరిద్దరు కలిసి
హైదరాబాద్: కథానాయకుడు రవితేజ జోరు మీదున్నారు. ‘ఖిలాడి’, ‘టైగర్ నాగేశ్వర్రావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘రావణసుర’ ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే, ‘రావణసుర’ తెరకెక్కిస్తున్న దర్శకుడు సుధీర్ వర్మతో రవితేజ కాంబినేషన్ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగుంది. వీరిద్దరూ కలిసి మొదట ఒక తమిళ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ, ఆ సినిమాలో నటించడానికి తెలుగులోని స్టార్ హీరోలంతా విముఖత చూపడంతో రీమేక్‌ను పక్కనపెట్టి.. ‘రావణసుర’ను పట్టాలెక్కించారట.
2017లో విడుదలైన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ కోలీవుడ్‌లో బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే, ఆ చిత్రం రవితేజకు బాగా నచ్చిందట. అందుకే, ఆ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు సుధీర్ వర్మతో రీమేక్ చేయాలని భావించారు. ఇందులో విజయ్ సేతుపతి పోషించిన ‘వేద’ పాత్రలో రవితేజ నటించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఆర్. మాధవన్ పోషించిన ‘విక్రమ్’ పాత్ర కోసం తెలుగులో చాలా మంది హీరోలను సంప్రదించారట. కానీ, వారెవరూ ఆ పాత్రలో నటించేందుకు ముందుకు రాలేదు. విచిత్రంగా వాళ్లంతా ‘విక్రమ్’ పాత్రకు బదులు ‘వేద’ పాత్రలో నటించేందుకు ఆసక్తి కనబర్చారట. పాత్ర మార్చుకోవడానికి రవితేజ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అందుకే, ఆ రీమేక్‌ను పక్కనపెట్టిన రవితేజ-సుధీర్ వర్మ.. ‘రావణసుర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్‌పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్‌పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్‌పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్‌కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!