ట్రెండింగ్‌లో టాలీవుడ్‌ హీరోలు

కొత్త ఏడాది.. టాలీవుడ్‌ ఇండస్ట్రీకి కొంతమేర పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది చిన్నబోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే మునుపటి కళను సంతరించుకుంటుంది. కొత్త సినిమాల వరుస రిలీజ్‌లతో 2021...

Updated : 01 Jan 2021 14:55 IST

నయా పోస్టర్లతో న్యూ ఇయర్‌ ఫీస్ట్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా గతేడాది చిన్నబోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే మునుపటి కళను సంతరించుకుంటోంది. కొత్త సినిమాల వరుస రిలీజ్‌లతో 2021 సినీ ప్రేమికులకు ఆనందాన్ని అందించనుంది. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిని పురస్కరించుకుని గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచే సామాజిక మాధ్యమాల్లో అగ్ర, యువ హీరోలకు సంబంధించిన కొత్త సినిమా పోస్టర్ల జోరు కొనసాగుతోంది. దీంతో పలువురు టాలీవుడ్‌ హీరోల పేర్లు ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. ‘వకీల్‌సాబ్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఉప్పెన’, ‘క్రాక్‌’, ‘ఖిలాడి’.. ఇలా ఎన్నో నయా పోస్టర్లు న్యూ ఇయర్‌ ఫీస్ట్‌గా విడుదలై నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని