Deepika Padukone: ఈ విషయాన్ని ఎప్పుడైనా కనిపెట్టారా?: దీపిక పదుకొణె

దీపావళి పండుగకి.. మా ఇంట్లో కుటుంబసభ్యుల పేర్లకు ఓ ఆసక్తికర సంబంధం ఉంది? ఎవరైనా గమనించారా అంటూ ప్రశ్నించింది పొడుకాళ్ల సుందరి, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది దీపిక.

Published : 02 Nov 2021 01:51 IST

నాన్న ప్రకాశ్‌, అమ్మ ఉజాల, చెల్లి అనిషా, నాపేరు దీపికలో కామెన్‌ పాయింట్‌ ఏమిటంటే 

ముంబయి: ‘దీపావళి పండుగకి.. మా ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లకు ఓ ఆసక్తికర సంబంధం ఉంది? ఎవరైనా గమనించారా’ అని ప్రశ్నిస్తోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. ‘నా చిన్నప్పుడు దీపావళి పండుగ రోజున ఉండే హంగామా అంతా ఇంతా కాదు. అప్పుడు మేం బెంగళూరులో ఉండేవాళ్లం. అక్కడ నా స్నేహితులతో కలిసి టపాసులు పేల్చేదాన్ని. మా ఇంట్లో నాన్న ప్రకాశ్‌, అమ్మ ఉజాల, చెల్లి అనిషా, నా పేరు దీపిక. మా అందరి పేర్లలో ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. ప్రకాశ్‌, ఉజాల, అనిషా, దీపిక.. ఈ నాలుగు పేర్లకి అర్థం ‘వెలుగు’. భలే తమాషాగా ఉంది కదూ!’ అని దీపిక చెప్పుకొచ్చింది. 

ఇక దీపిక కుటుంబ నేపథ్యానికొస్తే.. ఆయన తండ్రి ప్రకాశ్‌ పదుకొణె మాజీ భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు. 1980లో వరల్డ్‌ నంబర్‌ 1 క్రీడాకారుడిగా పేరొందారు. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా ప్రసిద్ధికెక్కారు. చెల్లి అనిషా సైతం క్రీడల్లో ప్రసిద్ధి. ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ క్రీడాకారిణిగా భారత్‌ తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇక దీపిక తదుపరి చిత్రం ‘83’ డిసెంబర్‌ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ భామ షారుక్‌ ‘పఠాన్‌’తో పాటు శాకున్‌ బాత్రా దర్శకత్వంలో రాబోతున్న చిత్రాల్లో నటిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని