Updated : 28/11/2021 08:49 IST

Bimbisara: టీజర్‌తో.. ‘బింబిసార’

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ దర్శకుడు. కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ‘‘అతను క్రూరమైన వాడు. బార్బేరియన్‌ కింగ్‌ తన భూభాగాన్ని గుర్తించడానికి వస్తున్నాడు’’ అంటూ చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. ఓ చారిత్రక కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో కల్యాణ్‌రామ్‌ బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని