Vijay Devarakonda: ఇంపార్టెంట్‌ వర్క్‌‌.. ఇకపై అంతా మీరే చూసుకోండి: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ నిర్మాతగా.. ఆయన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం...

Published : 13 Nov 2021 01:04 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ నిర్మాతగా.. ఆయన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించారు. శుక్రవారం ఉదయం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘పుష్పక విమానం’ రిలీజ్‌పై తాజాగా విజయ్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటి వరకూ తాను ‘పుష్పకవిమానం’ చిత్రాన్ని ప్రమోట్‌ చేశానని.. ఇకపై ఆ సినిమా బరువు బాధ్యతలు ప్రేక్షకులపైనే పెడుతున్నట్లు తెలిపారు.

‘‘లైగర్‌ సినిమా షూట్‌లో భాగంగా ముఖ్యమైన షెడ్యూల్‌ కోసం వెళ్తున్నాను. ఈ రోజు నుంచి మా సినిమా ‘పుష్పకవిమానాన్ని’ మీకే వదిలేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించి.. మరింత ప్రమోట్ చేస్తారని.. నా తరఫున కూడా సెలబ్రేట్‌ చేస్తారని అనుకుంటున్నాను’’ అని విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. మరోవైపు గురువారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ్‌.. ‘పుష్పక విమానం’ చిత్రాన్ని మహబూబ్‌నగర్‌లోని తన థియేటర్‌ ఏవీడీలో వీక్షించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని