Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
Tollywood: ఈవారం థియేటర్, ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలివే!
కరోనా తర్వాత వరుసగా సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఇప్పటివరకూ పాసింజర్ రైలులా సాగిన సినీ ప్రయాణం డిసెంబరు నెలలోఎక్స్ప్రెస్ స్పీడ్‌లో దూసుకుపోనుంది. అందుకు ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలే కారణం. మరి డిసెంబరు మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు అటు థియేటర్, ఇటు ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేద్దామా!
డిసెంబరు 2న బాక్సాఫీస్ దబిడి దిబిడే!
రాబోయే పండగ సీజన్‌కు నాంది పలుకుతున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna). బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘అఖండ’(Akhanda). ప్రగ్యాజైశ్వాల్(Pragya Jaiswal) కథానాయిక. శ్రీకాంత్(srikanth), జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇందులో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రచార చిత్రాల్లో అఘోరగా బాలకృష్ణ(balakrishna) డైలాగ్‌లు విజిల్స్ వేయిస్తున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద దబిడి దిబిడే మిగిలి ఉంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
కరోనా కష్టాలను దాటుకొని థియేటర్‌కు..
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohan lal) ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ తెరకెక్కించిన చిత్రం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’(Marakkar). రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 2020లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కరోనాతో లాక్డౌన్ విధించటంతో అప్పటి నుంచి ‘మరక్కార్’ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక దశలో విసుగు చెందిన నిర్మాత ఓటీటీకి ఇచ్చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఎట్టకేలకు డిసెంబరు 3న థియేటర్లలో విడుదల చేయనున్నారు. అర్జున్, కీర్తిసురేశ్, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లో విడుదల కాకముందే ‘మరక్కార్’ మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది.
‘బ్యాక్ డోర్’లో ఏం జరిగింది?
పూర్ణ(Poorna) ప్రధాన పాత్రలో నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘బ్యాక్ డోర్’(Back Door). కర్రి బాలాజీ తెరకెక్కించారు. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 3న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని దర్శకుడు బాలాజీ తెలిపారు.
‘ఆర్ఎక్స్100’ హిందీ రీమేక్ వచ్చేస్తోంది!
చక్కటి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ (RX 100). టాలీవుడ్లో సూపర్‌హిట్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ‘తడప్’ (Tadap) పేరుతో ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి (Ahan Shetty) ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అహాన్‌కు జంటగా తారా సుతారియా (Tara Sutaria) కథానాయికగా నటిస్తున్నారు. మిలాన్ లుతారియా (Milan Luthria) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3న (Tadap Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.
‘స్కైలాబ్’ భూమిపై పడుతుందని తెలిసిన తర్వాత..
సత్యదేవ్(satyadev), నిత్యమేనన్(nityamenen), రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్’(skylab). విశ్వక్ ఖండేరావు దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. డా.రవి కిరణ్ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1979 నేపథ్యంలో సాగే చిత్రమిది. గౌరి, ఆనంద్, సుబేదార్ రామారావులు ఒకొక్కరు ఒక్కో లక్ష్యంతో ముందుకు సాగుతుంటారు. తమ కలలు నెరవేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే అనుకుంటారు. సరిగ్గా అప్పుడే అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్(skylab) ఉపగ్రహం సాంకేతిక కారణాలతో భూమిపై పడతుందనే విషయం తెలుస్తుంది. అప్పుడు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? అవి ఎలా నెరవేరాయన్నది ‘స్కై లాబ్’ కథ. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
నెట్‌ఫ్లిక్స్
* లాస్ ఇన్ స్పేస్ (వెబ్ సిరీస్) డిసెంబరు 1
* ద పవర్ ఆఫ్ ది డాగ్(హాలీవుడ్) డిసెంబరు 1
* కోబాల్ట్ బ్లూ(హాలీవుడ్) డిసెంబరు 3
* మనీ హెయిస్ట్ 5 (స్పానిష్ సిరీస్)
ఆహా
* మంచి రోజులు వచ్చాయి(తెలుగు) డిసెంబరు 3
జీ5
* బాబ్ విశ్వాస్(హిందీ) డిసెంబరు 3
అమెజాన్ ప్రైమ్
* ఇన్ సైడ్ ఎడ్జ్(హిందీ వెబ్‌సిరీస్)డిసెంబరు 3
బుక్ మై షో
ఎఫ్9(తెలుగు) డిసెంబరు 01
-ఇంటర్నెట్‌డెస్క్
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్‌తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్‌ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్‌లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్‌లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్‌చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!