Tamannaah: ఆమె గౌనుకు పెట్టిన డబ్బుతో ఓ కారు కొనొచ్చు..!

ఫ్యాషన్‌ విషయంలో ఎంత డబ్బు ఖర్చుపెట్టడానికైనా నటీనటులు వెనుకాడరు. సాధారణంగా వాళ్లు ధరించే దుస్తుల ధరలు వేలల్లో ప్రారంభమై.. లక్షల వరకూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే....

Updated : 30 Aug 2021 14:59 IST

హైదరాబాద్‌: ఫ్యాషన్‌ విషయంలో ఎంత డబ్బు ఖర్చుపెట్టడానికైనా నటీనటులు వెనుకాడరు. సాధారణంగా వాళ్లు ధరించే దుస్తుల ధరలు వేలల్లో ప్రారంభమై.. లక్షల వరకూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, ఓ ఫొటోషూట్‌ కోసం నటి తమన్నా సైతం అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించారు. ఆమె ఆ డ్రెస్‌కు పెట్టిన డబ్బుతో ఓ బేసిక్‌ మోడల్‌ కారు కొనుగోలు చేయవచ్చని ఫ్యాషన్‌ ప్రియులు చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రెస్ ధర ఎంతంటే..

ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, షోలతో ఫుల్‌ బిజీగా ఉంటున్న తమన్నాకు తాజాగా షూటింగ్స్‌ నుంచి చిన్న విరామం దొరికింది. ఫొటోషూట్స్‌తో ఆ కాస్త విరామాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఫొటోషూట్స్‌ కోసం ఆమె ధరించిన డ్రెస్సుల్లో నలుపు రంగు గౌను అందర్నీ ఎంతో ఆకర్షించింది. దీంతో దాని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని కొంతమంది భావించారు. FarFetch.com అనే వెబ్‌సైట్‌లో ఆ డ్రెస్ గురించి సెర్చ్‌ చేయగా.. ధర తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే దాని ధర సుమారు 5 వేల యూఎస్‌ డాలర్లు ఉంది. ఇదే డబ్బుతో ఓ కారు కొనుగోలు చేయవచ్చు కదా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని