SIIMA 2020: ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు.. అవార్డు అందుకునేదెవరో?

సైమా 2020 ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు నామినేష్ల వివరాలు.

Published : 30 Aug 2021 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ (సైమా) వేడుక మరికొన్ని రోజుల్లోనే సందడి చేయనుంది. అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఈ అవార్డులని ఎవరెవరు అందుకుంటారా? అనే ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే పలు విభాగాలకి సంబంధించిన నామినేషన్లని ప్రకటించిన సైమా తాజాగా  2020 సంవత్సరానికిగానూ ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడికి పోటీ పడుతున్న వారి జాబితాని విడుదల చేసింది. ఆ వివరాలివీ..

ఉత్తమ నటుడు: మహేశ్ బాబు (సరిలేరు నీకెవ్వరు), అల్లు అర్జున్‌ (అల వైకుంఠపురములో), సుధీర్‌బాబు (వి), సత్యదేవ్‌ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), నితిన్‌ (భీష్మ). ఉత్తమ సహాయ నటుడు:  రాజేంద్ర ప్రసాద్‌ (సరిలేరు నీకెవ్వరు), మురళీశర్మ  (అల వైకుంఠపురములో), నరేశ్‌ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), రావు రమేశ్‌ (సోలో బ్రతుకే సో బెటర్‌), తిరువీర్‌ (పలాస 1978).

విజేతలను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా నిర్ణయించునున్నారు. www.siima.in వెబ్‌సైట్‌తో పాటు SIIMA ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రేక్షకులు తమ అభిమాన నటుడికి ఓట్లు వేసి గెలిపించవచ్చు. మరి ఎవరు ఈ అవార్డుని అందుకుంటారో తెలియాలంటే సెప్టెంబరు 18 వరకు ఆగాల్సిందే. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు 18, 19 తేదీల్లో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు దూరమవడంతో 2019, 2020 సంవత్సరాలకి సంబంధించిన అవార్డుల్ని 2021లోనే ఇవ్వనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు