Updated : 29/11/2021 08:27 IST

Shahid Kapoor: షాహిద్‌.. ‘బ్లడీ డాడీ’

షాహిద్‌ కపూర్‌ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘జెర్సీ’ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్‌ - డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న వెబ్‌సిరీస్‌ నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఇప్పుడాయన దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌తో కలిసి ఓ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రెంచ్‌లో విజయవంతమైన ‘స్లీప్‌లెస్‌ నైట్స్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ చిత్రానికి ‘బ్లడీ డాడీ’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. అపహరణకు గురైన బిడ్డను రక్షించుకునేందుకు.. ఓ తండ్రి మాఫియాతో చేసే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. ఇందులో షాహిద్‌ ఆ తండ్రి పాత్రలోనే కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని