Samantha: సమంత పిటిషన్‌పై సోమవారం విచారణ

సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ ప్రముఖ నటి సమంత కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మూడు యూట్యూబ్‌ ఛానళ్లతోపాటు సీఎల్‌ వెంకట్రావుపైన ఆమె పరువు నష్టం దావా దాఖలు చేశారు.

Published : 22 Oct 2021 20:42 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ ప్రముఖ నటి సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్‌ వేయొచ్చన్న సమంత తరఫు న్యాయవాది బాలాజీ వాదనతో కోర్టు ఏకీభవించింది. పరువునష్టం కలిగించేలా ఇక నుంచి మాట్లాడకుండా నిరోధించాలన్న అభ్యర్థనపై సోమవారం విచారణ జరపనుంది.

సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతో పాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై  సమంత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు ఛానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని