RRR Trailer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే.. అక్కడ కూడా విడుదల..!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ట్రైలర్‌ని

Updated : 04 Dec 2021 17:18 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. ప్రముఖ సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు కొన్ని అనుకోని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా వేశారు. తాజాగా ట్రైలర్‌ను డిసెంబరు 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాదు, అదే రోజున ఉదయం 10గంటలకు థియేటర్స్‌లోనూ విడుదల చేయనున్నారు.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని