RRR: ఐటమ్‌ సాంగ్‌ ఉంటే నువ్వు చేస్తావా?

రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7, 2022లో ఈసినిమ....

Published : 28 Nov 2021 01:23 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7, 2022లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ‘జనని’ అనే దేశభక్తిని చాటే పాటను ప్రేక్షకులతో పంచుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోన్న ఈ పాటకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. ఈ పాటని చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఓ నెటిజన్‌.. ‘‘సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ ఏదైనా ఉందా మామా?’’ అని కామెంట్‌ చేశాడు. దానిపై స్పందించిన టీమ్‌ సరదాగానే నెటిజన్‌కు చురకలు పెట్టింది. ‘‘ఏ ఒకవేళ ఐటమ్‌ సాంగ్‌ ఉంటే నువ్వు చేస్తావా?’’ అని అడిగింది. ఇప్పుడు ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో నెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మావ.. రోజురోజుకీ అప్‌డేట్‌ అవుతున్నాడు. మీమ్స్‌, కౌంటర్లతో అదరగొట్టేస్తున్నాడు’’ అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో హాలీవుడ్‌, బాలీవుడ్‌ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ ముఖ్య భూమికల్లో కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని